Reading Time: < 1 minute

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ మూవీ రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. బుధవారం సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదటి భాగం పెయిడ్ ప్రీమియర్ షోల వసూళ్లను అధిగమించిన ఈ సినిమా ఏకంగా రూ. 52 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది ఈ సినిమా.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రిమియర్ షోల నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యే చాన్స్ ఉంది. కాగా, ఈ ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ నటించారు. డిసెంబర్ 2025లో మొదటి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రెండో భాగం కూడా రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.