
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా పతమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 7,140 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 6,550 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,50,280కి దిగొచ్చింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,750కి చేరుకుంది. అలాగే, ఇవాళ ఒక్కరోజే కేజి వెండి ధరపై రూ.10 వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలకు పడిపోయింది.