Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎల్బి నగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్‌’లో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బినగర్ బిఆర్ఎస్ నేతలు వైట్ ఛాలెంజ్ విసిరారు. బిఆర్ఎస్ నేత ఛాలెంజ్‌ని స్వీకరించి కాంగ్రెస్ నేతలు ఎల్బి నగర్‌కు చేరుకున్నారు. ఎల్బి నగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. వైట్ ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర నేతలు ఎల్బి నగర్‌కు వెళ్లారు. దీంతో సుధీర్ రెడ్డి, ఇతర బిఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.