Reading Time: < 1 minute

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో గురువారం డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. మార్కెట్ లో పట్టుబడిన బంగారం ధర దాదాపు రూ.కోటి విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.ఇక, నిందితుడని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విచారించనున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు చెప్పారు.