Reading Time: < 1 minute

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ:లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరు దేశాల మధ్య పంతం చల్లారడం లేదు. తాజాగా తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా బుధవారం అర్థరాత్రి ఇరాన్ కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ అర్థిక వ్యవస్థకు పునాది. దీంతో అత్యవసర బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేయించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దాడిలో ఆ ప్రాంతం భారీస్థాయిలో దెబ్బ తిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి.

అయితే తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులను ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీన దాడితో భారతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఫర్టిలైర్స్, సిఎన్‌జి, పిఎన్‌జి అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే భారత్ ఆధారపడి ఉంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ 47 శాతం ఖతార్ నుంచే కొనుగోలు చేస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ స్పందిస్తూ.. ఇరాన్ క్షిపిణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్ కేంద్రాల్లో నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు వెల్లడించింది. దీంతో భారత్‌లో నేచురల్ గ్యాస్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది.