Reading Time: < 1 minute

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కేంద్రం(ఐఎండి) భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఎపిలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వానలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అకాశం ఉందని.. అలాగే, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని పేర్కొంది.

ఇక, ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ, పశ్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే.. గుంటూరు, కాకినాడ, ఏలూరు జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.