
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన కోరినట్లు సమాచారం. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరినట్లు తెలుస్తోంది. ఐపిఎల్ 2025కు ముందు అగార్కర్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బిసిసిఐని అభ్యర్థించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ కానీ, అజిత్ అగార్కర్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. 2023 నుంచి అగార్కర్ భారత జట్టు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ మూడేళ్ల పదవీకాలంలో భారత్ నాలుగు ఐసిసి టోర్నమెంట్‌ల ఫైనల్స్‌కు చేరగా.. మూడింట విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన భారత్.. అక్కడ ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2024 టి-20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, టి-20 ప్రపంచకప్ 2026లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.