Reading Time: < 1 minute

ఢిల్లీ: పార్టీ నమోదు వ్యవహారంలో మాజీ ఎంఎల్‌సి కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి సూచించింది. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పై వీలైనంత త్వరంగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు ఇసి చెప్పిన విషయం తెలిసిందే. లోపాలన్నీ సరి చేశామని కోర్టుకు కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. సాంకేతిక తప్పులు సరి చేసి ఇసికి మళ్లీ దరఖాస్తు చేశామని కవిత లాయర్లు తెలిపారు. కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు ఎన్నికల సంఘం తెలపడంతో విచారణ ముగిసింది.