Reading Time: < 1 minute

హైదరాబాద్: ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని ఇసికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కవిత పిటిషన్‌పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.