Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందనలు తెలిపారు. ​ఇటీవలే ఆయన రాసిన ‘మాయి ముంత’ కథలను చదివానని, అందులో మాయి ముంత, సావు దప్పు, జిద్దు వంటి కథలు తనని లోతుగా కదిలించాయని, అవి కేవలం కథలు కావు, మన అస్తిత్వపు వేదనలు అని అశోక్ ను ప్రశంసించారు. భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలివి అని కొనియాడారు. ​మట్టి పరిమళాల రచయిత అశోక్ కుమార్ కు కెటిఆర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.