
మేషరాశి
ఆదాయం: 11 వ్యయం: 05
రాజ: 02 అవ: 04
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు.
మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుం ది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్య యంలో శని అలాగే జూన్ 2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థం స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటా యి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. ఈ ఏలిననాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు.
కెరియర్ పరంగా మంచి అభి వద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. మేష రాస్యాధిపతి బలం కలిగి ఉండటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దష్టి పెట్టవలసి ఉంటుంది. సోదరి సోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోయి రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడు తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరాశి వారికి ఏలిననాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు కానీ వివాహ నిశ్చయానికి, పెళ్ళికి సమయం కొంత ఎక్కువగా వుండవచ్చు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి.
విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతో పాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి.
విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. హెచ్1 బి వీసా, పి.ఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.
స్త్రీలకు ప్రత్యేకం ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తి స్తాయి. ఆరోగ్యం విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది.అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం.వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అత మంచిది. విహార యాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరుప్రఖ్యాతలు పెంచుకోగలుగు తారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్‌వేర్ రంగంలోని వారు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐ.ఎ.ఎ స్., ఐ.పి.యస్. వంటి సివిల్ సర్వీస్‌లకు అతికష్టం మీద ఎంపిక అవుతారు. వివాహం విషయంలో జాతక పరిశీలన అలాగే కుటుంబ ప రంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం, ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం, క్రీడారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికరాశి
ఆదాయం: 11 వ్యయం: 05
రాజ: 02 అవ: 06
విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు.
వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతువు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థికపరంగా అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్థం వరకు దూరంగా ఉండటం మంచిది. ఛాయాగ్రహమైన రాహువు మాత స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. జూన్ రెండవ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతియైన గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణాలు చాలా వరకు తీర్చగలుగు తారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు, హోటల్‌మేనేజ్‌మెంట్, హోల్‌సేల్ రిటేల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికలావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమకుతగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి. డిసెంబర్ 5వ తేదీన రాహువు చతుర్థం నుండి తృతీయ స్థానంలోకి కేతువు దశమంనుండి భాగ్యస్థానంలోకి మారడం వలన చిన్నచిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చికరాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింటిలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయ పరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్నిజాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. థైరాయిడ్, బి.పి., షుగర్, ఇండైజిషన్, ఉదర సంబంధిత సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విద్యా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.ద్వితీయార్థంలో వీసాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తె అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలం- గా ఉంది. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పదిమందిలో మెచ్చుకోలుగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, సాఫ్ట్‌వేర్, మెకానికల్, కళాసాంస్కృతిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీపార్లర్స్, కాస్మోటిక్స్, ఇ.ఎన్.టి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాలలో ఉన్న వారు మంచి అబివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం, అలాగే రాహుకేతువులకు జప, దాన, తర్పణాలు చేయించడం అనేది చెప్పదగిన సూచన. స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసివస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్యా సాంస్కృతిక విషయాలలో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వత్తి, ఉద్యోగాలపరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాలలో మీ శ్రమకి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, ఐ.వి.ఎఫ్ కోసం వెళ్ళేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తి స్తారు. ఆర్భాటాలకు, పొగడ్తలకు దూరంగా ఉండటం చెప్పదగినది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థాధిపతియైన రాహువు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వలన సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు.ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.