Reading Time: 8 minutes

మేషరాశి

ఆదాయం: 11 వ్యయం: 05

రాజ: 02 అవ: 04

అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు. 

మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుం ది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్య యంలో శని అలాగే జూన్ 2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థం స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటా యి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. ఈ ఏలిననాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు.

కెరియర్ పరంగా మంచి అభి వద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. మేష రాస్యాధిపతి బలం కలిగి ఉండటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దష్టి పెట్టవలసి ఉంటుంది. సోదరి సోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోయి రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడు తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరాశి వారికి ఏలిననాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు కానీ వివాహ నిశ్చయానికి, పెళ్ళికి సమయం కొంత ఎక్కువగా వుండవచ్చు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి.

విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతో పాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి.

విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. హెచ్1 బి వీసా, పి.ఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

స్త్రీలకు ప్రత్యేకం ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తి స్తాయి. ఆరోగ్యం విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది.అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం.వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అత మంచిది. విహార యాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరుప్రఖ్యాతలు పెంచుకోగలుగు తారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్‌వేర్ రంగంలోని వారు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐ.ఎ.ఎ స్., ఐ.పి.యస్. వంటి సివిల్ సర్వీస్‌లకు అతికష్టం మీద ఎంపిక అవుతారు. వివాహం విషయంలో జాతక పరిశీలన అలాగే కుటుంబ ప రంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం, ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం, క్రీడారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 

వృశ్చికరాశి

ఆదాయం: 11 వ్యయం: 05

రాజ: 02 అవ: 06

విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు.

వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతువు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థికపరంగా అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్థం వరకు దూరంగా ఉండటం మంచిది. ఛాయాగ్రహమైన రాహువు మాత స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. జూన్ రెండవ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతియైన గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణాలు చాలా వరకు తీర్చగలుగు తారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు, హోటల్‌మేనేజ్‌మెంట్, హోల్‌సేల్ రిటేల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికలావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమకుతగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి. డిసెంబర్ 5వ తేదీన రాహువు చతుర్థం నుండి తృతీయ స్థానంలోకి కేతువు దశమంనుండి భాగ్యస్థానంలోకి మారడం వలన చిన్నచిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చికరాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింటిలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయ పరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్నిజాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. థైరాయిడ్, బి.పి., షుగర్, ఇండైజిషన్, ఉదర సంబంధిత సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విద్యా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.ద్వితీయార్థంలో వీసాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తె అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలం- గా ఉంది. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పదిమందిలో మెచ్చుకోలుగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, సాఫ్ట్‌వేర్, మెకానికల్, కళాసాంస్కృతిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీపార్లర్స్, కాస్మోటిక్స్, ఇ.ఎన్.టి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాలలో ఉన్న వారు మంచి అబివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం, అలాగే రాహుకేతువులకు జప, దాన, తర్పణాలు చేయించడం అనేది చెప్పదగిన సూచన. స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసివస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్యా సాంస్కృతిక విషయాలలో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వత్తి, ఉద్యోగాలపరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాలలో మీ శ్రమకి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, ఐ.వి.ఎఫ్ కోసం వెళ్ళేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తి స్తారు. ఆర్భాటాలకు, పొగడ్తలకు దూరంగా ఉండటం చెప్పదగినది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థాధిపతియైన రాహువు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వలన సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు.ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

ధనుస్సురాశి

ఆదాయం: 14 వ్యయం: 11

రాజ: 05 అవ: 06 మూల 1,2,3,4 పాదములు, పూర్వాషాఢ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదముల యందు పుట్టినవారు.

ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, సప్తమంలో గురువు, తొమ్మిదింట కేతువు, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో, డిసెంబర్ 5వ తేదీ నుండి రాహువు ద్వితీయంలో, కేతువు అష్టమంలోకి మారుతారు. ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి అర్దాష్టమ శని నడుస్తోంది. అర్దాష్టమ శని ప్రభావం వలన మానసికమైన ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ రాశివారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుం ది. డిసెంబర్ 5 నుండి కేతువు అష్టమంలో ఉండటం వలన ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి ఆరోగ్యం విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాహువు ద్వితీయ స్థానంలోకి మారడం వలన ఆర్థికంగా కలిసివస్తుంది. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ లభిస్తాయి. సేవింగ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండటం, పొగిడే వాళ్లను దూరంగా ఉంచడం చెప్పదగినది. ఉద్యోగంలో మీపై దుష్ర్పచారం చేసే వారుంటారు జాగ్రత్త వహించండి. ఎవరు ఎన్ని చెప్పినా న్యాయబద్ధంగా నడుచుకోవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని భావిస్తారు. గ్రీన్‌కార్డు వీసాకోసం ప్రయత్నం చేసే వారికి వీసా లభిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. వివాహాది శభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానం యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ న్యాయవాదులకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, రియల్‌ఎస్టేట్ రంగంలోని వారికి, ప్రథమార్థం బాగున్న ప్పటికీ, ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు అఘోరపాశుపత హోమం, లక్ష్మీగణపతి హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. మెడలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన గ్రహదిష్టి, నరదిష్టి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఏది ఏమైన మీకున్న ధైర్య సాహసాల వల్లనే బాగా రాణిస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటిలో సీటు లభిస్తుంది. హెచ్1బి వీసా లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. సెల్ఫ్‌డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైన ఉంటే తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. మీరు ఎంత కష్టపడితే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. క్రమశిక్షణతో అడుగులు వేస్తారు. డిసెంబర్ 5 తర్వాత రాహువు ద్వితీయ స్థానంలో ఉండడం వలన ధనప్రాప్తి, ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సేవింగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం, అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం మంచిది. స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి అధికారప్రాప్తి. కుటుంబంలోని బరువుబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించి, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్థం చాలావరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఏర్పడుతా యి. వ్యాపార పరంగా అధిక ధనవ్యయ సూచ న. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అయితే మీరు ఒత్తిడిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్, చార్టెడ్ అకౌంటెంట్స్, బొటిక్స్, సినీ కళారంగంలోని వారికి, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ , అడ్మిని స్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ధనం తక్కువగా సంపాదించినా పేరుప్రఖ్యాతలు బాగుంటాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఐ.టి. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా మీకున్న తెలివి తేటలతో అధిగమిస్తారు. వివాహానికి సం బంధించిన విషయ వ్యవహరాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ద్వి తీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతా నం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భూ క్రయవిక్రయాలు లాభిస్తాయి. వాహనయోగం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరుమీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల మోసపోయే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన.

మీనరాశి

ఆదాయం: 14 వ్యయం: 11

రాజ: 07 అవ: 02

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు.

మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్ఠమంలో కేతువు, వ్యయంలో రాహువు ఉన్నారు. గురువు జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు ఆరవ స్థానంలో ఉంటారు. అంటే రోగస్థానంలో కేతువుతో పాటు కలిసి ఉంటారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. మీన రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపారపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపేణ ధనం సమకూరుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత మీనరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపార పురోగతి బాగుంటుంది. రాస్యాధిపతి దశమాధిపతియైన గురువు పంచమస్థానంలో ఉచ్ఛస్థితి పొంది ఉండడం వలన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహ అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రజాధరణ పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది, మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పరంగా ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కళా, సాహిత్యరంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహువు లాభస్థానంలోకి, కేతువు పంచమంలోకి మారడం వలన విశేషమైన పేరుప్రఖ్యాతులు, ఆర్థికపురోగతి బాగుంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. వివాదస్పదమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం అనేది చెప్పదగినది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను మీకు అప్పగిస్తారు. సినీ కళారంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, డాక్యుమెంట్ రైటర్స్‌కి, చిరువ్యాపారస్తులకు, లెదర్ వ్యాపారస్తులకు, జూడ్‌బ్యాగ్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నవారికి, కాస్మటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మారంగంలోని వారికి, గోల్డ్‌స్మిత్స్‌కి, బొటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకు, పూజాసామాగ్రి వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు ఫాస్ట్‌పుడ్ సెంటర్స్‌కి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత విద్య కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది. స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్‌కార్డు, హెచ్1బి వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా, యు.కె. జర్మనీ, ఈ దేశాలు వెళ్ళే వారికి, ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటి, స్కిన్‌కి సంబంధించిన విషయ వ్యవహారాలు మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, స్పైన్‌కి సంబంధించిన విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ధన వ్యయం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రూపాయి వస్తుంది కదా అని రెండు రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంది, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే, భవిష్యత్తులో ఇబ్బందిపడే అవకాశం లేకపోలేదు. చదువుపై శ్రద్ధ వహించకపోతే చదువు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఏదో ఉద్యోగం చేసే ఆలోచన వస్తుంది. చదువుకునే వయసులో చదువుని అశ్రద్ధ చేయడం సరికాదు. సంగీత, సాహిత్యాది, లలితకళల పట్ల ఆసక్తి కనబరుస్తారు. స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతే సఫలం అవుతాయి. అధికార స్థానాలలో వున్నవారు అత్యంత సన్నిహితం అవుతారు. స్వప్రయోజనాలు, అభివద్ధి కొరకు పరపతి ఉపయోగపడుతుంది. ఆర్థిక వనరులను ఇబ్బందిలేని రంగాల్లో పెట్టుబడులు పెడతారు. శుభ కార్యాలకు బంధువర్గం సహకారం కన్నా దైవమే ఎక్కువ మేలు చేస్తాడు. ముందు జాగ్రత్త చర్యలు అనుకున్న ఫలితాలని ఇస్తాయి. కళ, విద్యారంగాల్లో రాణిస్తారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవలసిన పరిస్థితి రావచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విదేశీయానం చేస్తారు. సం తానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగం సాధిస్తారు. కొన్ని కొన్ని విషయాలలో జీవితభాగ స్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుం ది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న చోట సీటు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. బ్యూటీపార్లర్ వ్యాపారస్తులకు, కాస్మోటిక్స్, బ్యూటిషియన్, బొటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కి ఆర్టిపిషియల్ జ్యువెలరి రంగంలో ఉన్నవా రికి ఈ సంవత్సరం మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి అనుకూలంగా ఉంటుంది. హెచ్1బి, గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ పరమైన అవార్డులు అందుకోగలుగుతారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి వాటికి కష్టంమీద ఎంపికవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, మనమీద ఈర్ష్యాద్వేషాలు ఉంటాయని అలాగే ధరించకుండా ఉంటారు. అభరణాలను లాకర్లలో భద్రపరచండి, ఇంట్లో భద్రపరచడం అంత క్షేమం కాదు. రాజకీయ రం గంలో ఉన్న వారికి పదవలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం రాహువుకి అధిష్టాన దేవత దుర్గా దేవి కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళ, శుక్రవారం రోజున అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించడం, ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.

:: పంచాంగ కర్త ::

శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి

వైధిక్‌ఆస్ట్రో.కామ్ (www.vydicastro.com)

ఫోన్ నెం: 90141 26121, 84669 32224/2225