
మేషరాశి
ఆదాయం: 11 వ్యయం: 05
రాజ: 02 అవ: 04
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు.
మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుం ది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్య యంలో శని అలాగే జూన్ 2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థం స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటా యి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. ఈ ఏలిననాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు.
కెరియర్ పరంగా మంచి అభి వద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. మేష రాస్యాధిపతి బలం కలిగి ఉండటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దష్టి పెట్టవలసి ఉంటుంది. సోదరి సోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోయి రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడు తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి.
సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరాశి వారికి ఏలిననాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు కానీ వివాహ నిశ్చయానికి, పెళ్ళికి సమయం కొంత ఎక్కువగా వుండవచ్చు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి.
విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతో పాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి.
విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. హెచ్1 బి వీసా, పి.ఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.
స్త్రీలకు ప్రత్యేకం ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తి స్తాయి. ఆరోగ్యం విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది.అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం.వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అత మంచిది. విహార యాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి.
నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరుప్రఖ్యాతలు పెంచుకోగలుగు తారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్‌వేర్ రంగంలోని వారు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐ.ఎ.ఎ స్., ఐ.పి.యస్. వంటి సివిల్ సర్వీస్‌లకు అతికష్టం మీద ఎంపిక అవుతారు. వివాహం విషయంలో జాతక పరిశీలన అలాగే కుటుంబ ప రంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం, ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం, క్రీడారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
వృషభరాశి
ఆదాయం: 05 వ్యయం: 14 రాజ: 05 అవ: 04
కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల యందు పుట్టినవారు.
వృషభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు, ఏకాదశంలో శని, ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడాను శుభ స్థానంలో ఉంటారు. గురువు జూన్ రెండవ తేదీ వరకు 2వ స్థానంలో ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి మారుతారు. అలాగే రాహువు దశమ స్థానం నుండి భాగ్యంలోకి, కేతువు చతుర్థ స్థానం నుండి తృతీయంలోకి డిసంబర్ 5 వ తేదీన మారుతారు. ఈ ప్రదానమైన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది.
వృత్తి పరంగా తిరుగులేని విధంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ, మెటల్స్(ఇనుము), ఆయిల్ వ్యాపారస్థులకు కానీ, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు అమ్మే వ్యాపారస్థులకు లాభాలు బాగుంటాయి.
ఆదాయం కొద్దికొద్దిగా పెరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలకు లోటుఉండదు. చిరువ్యాపారాలు, డాక్టర్స్‌కి, లాయర్స్‌కి, ఫార్మా రంగం వారికి, ట్రా వెల్స్ ఏజెన్సీ వారికి, ఆటోమోబైల్స్ రంగంలోని వారికి ఈ సంవత్సరంచాలా వరకు అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ రంగంలోని వారికి ఎక్కువ శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. విదేశీ ఉద్యోగాలు, లేదా మీ చదువుకు సంబం దించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి.హెచ్1బి వీసా, గ్రీన్‌కార్డు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువు కోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్త్రీల వలన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. కుటుంబం కోసం ఎంత శ్రమించినప్పటికీ కు టుంబంలో మీకు విలువ తక్కువగా ఉంటుంది. మీ వల్ల బంధువర్గం లాభాలు పొందగలరు. ష్యూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్‌కు ప్రాదాన్యత ఇవ్వండి. రాజకీయ రంగంలో పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. సంవత్సర ద్వితీయార్థం నుండి అనగా డిసెంబర్ 5 నుండి భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు ప్రభావం వలన సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు ఏర్పడుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందకు వెళ్ళాలి. లేక పోతే ఉద్యోగంలో స్థానచలనం సూచిస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. గృహయోగం, వాహనయోగం ఉంది. కళా సంబంధమైన విషయాలలో, వృత్తి ఉద్యోగాలలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. నిత్యం ఓం నమశ్శివాయవత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించాలి. విద్యార్థినీ విద్యార్థులు చదువు పై ఎక్కువగా శ్రద్ద పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతనే సఫలం అవుతాయి. హెచ్1బి వీసా కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్టూడెంట్స్ లోన్ మం జూరు అవుతుంది. ఏదైన సరే ఒకచోట స్థిరంగా ఉండి స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. తద్వారా అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గ్యాస్ట్రిక్, ఇండైజిషన్, స్కిన్, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్, హెచ్.ఆర్. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసివస్తాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటమనేది చెప్పదగినది.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అన్నివిధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న చికాకులు తొలగుతాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి విశేషమైన కృషి చేస్తారు. ఏపనైన సరే ఒత్తిడి లేకుండా పూర్తవదని గ్రహించగలు గుతారు. అయితే డిసెంబర్‌లో చతుర్థాధిపతియైన కేతువు తృతీయంలోకి మారడం వలన సంతానం యొక్క ఆరోగ్యంపట్ల, చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రీన్‌కార్డు లభిస్తుంది. మీ కష్టాన్ని బయటవాళ్ళు గుర్తించిన విధంగా, ఇంట్లో వాళ్ళు గుర్తించలేరు అనే భావన కలుగు తుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రాప్తి, సంతానంకోసం ప్రయత్నం చేస్తున్నవారికి సంతానప్రాప్తి కలుగు తుంది. మీరు అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. మెకానికల్, చిరు వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్థులకు, హోటల్ వ్యాపార స్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి, బ్యూటిషియన్స్, ఫ్యాషన్‌డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, వ్యవ సాయ ఉత్పత్తుల రంగం, హోమియో రంగాలలో ఉన్నవారికి, డెంటిస్ట్, ఇ.ఎన్.టి వృత్తి వారికి తదితర వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం కలుసుబాటుగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. విమర్శలకు తావు లేకుండా రాజకీయ పదవి లభిస్తుంది. ఈ రాశివారు ప్రతినిత్యం లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం, ప్రతి బుధ వారం రోజున జిల్లేడు వత్తులతో గణపతి స్వామి వారికి పూజ చేయడం అనేది చెప్పదగిన సూచన.
మిధునరాశి
ఆదాయం: 08 వ్యయం: 11
రాజ: 01 అవ: 07
మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల యందు పుట్టినవారు.
మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయం లో కేతవు, నవమంలో రాహువు, దశమంలో శని అలాగే గురువు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీవరకు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టబడులు పెడతారు. విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు. వాక్ శుద్ధి పెరుగుతుంది. మీమాట తీరు మెరుగుపడుతుంది.రాహువు 9వ స్థానంలో కేతువు మూడవ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతాయి. ఏ పనినైనా పట్టుదలతో సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. విదేశీ విద్య కోసం, విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల వత్తిపరంగా పనిభారం అనేది పెరుగుతుంది. పై అధికారులు మీ కషిని మీ సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. గురువు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో వత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, వాటిని సద్వినియోగ పరుచుకోవడమనేది చెప్పదగినది.
ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, విదేశీయాన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యలో బాగా రాణించి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలం, అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్వంత నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్‌వేర్, మెకానికల్, ఫార్మ ఎయిర్‌ఫోర్స్ ఈ రంగాలలోని ఉన్నవారు మంచి అభివృద్ధిలోకి వస్తారు.
అనుకూలమైన గురు గ్రహ ప్రభావం వలన వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం పెరుగుతాయి. రాశివారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయా అంటే మాత్రం కొన్ని ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.ఈ సంవత్సరం పని భారం అనేది అధికంగా ఉంటుంది. వర్క్‌లోడ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. శని కర్మ స్థానంలో ఉన్నప్పుడు వత్తి పరంగా కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటారు. స్థిరాస్తులు ఏర్పర్చుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో ప్రవేశపెడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొంతమంది విషయంలో నూతన పదవులు మరియు సన్మానాలు పొందుతారు. నిరుద్యోగులకు మీ కృషితోపాటు అదష్టం కూడా అవసరం. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబం వద్ధిలోకి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. జీవితం ఊహించని విధంగా సానుకూల మలుపులు తిరుగుతుంది.
వత్తిఉద్యోగాల్లో సంపాదన బాగా పెరుగు తుంది. రాజకీయ, సాహిత్య, సాంస్కతిక, చలనచిత్రరంగంలోని వారికి క్రీడారంగాలలోని వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలుగుతాయి. జి.ఎస్.టి వల్ల కొన్ని చికాకులు ఏర్పడుతాయి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు లభిస్తాయి. సామాజికంగా జరిగేమార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మార్పులు చూపిస్తాయి. సెదరులకు రహస్యంగా ధన సహాయం చేస్తారు. లోహపు వ్యా పారస్తులకు కాలం అనుకూలం. హోటల్ మేనేజ్‌మెంట్, నూతన వ్యాపారస్తులకు, చేతిపనిముట్ల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భూములు కొనుగోలు, అమ్మకాలులో మీ ఓ ర్పు, సహనం వల్ల లాభపడతారు.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జూన్ 2న గురువు ద్వితీయంలోకి మారడం వలన, భాగ్య స్థానాన్ని చూడడం వలన అదృష్టం కలిసి వస్తుంది.ఉన్నత విద్య, దూర ప్రయాణాలు కలిసివస్తాయి. నలుగురిలోను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఎక్కువగా కష్టపడటం వలన కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు లాభిస్తాయి. అతికష్టం మీద మీరు ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ అండదండలతో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్‌వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాదేవి స్తోత్రం పఠించడం అనేది చెప్పదగినది.
కర్కాటకరాశి
ఆదాయం: 02 వ్యయం: 11
రాజ: 04 అవ: 07
పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల యందు పుట్టిన వారు.
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు, డిసెంబర్ 5 నుండి కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహువు సంచరిస్తారు. జూన్ 2 వరకు గురువు 12వ స్థానంలో ఉంటాడు. అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు. ఆర్థికంగా ఖర్చులు పెరుగు తాయి. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తలు వహించాలి.
గురువు జూన్ రెండవ తేదీ తర్వాత జన్మరాశిలోకి గురువు వస్తాడు. షష్ఠమ భాగ్యాధిపతియైన జన్మరాశిలో ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసివస్తాయి. మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి-ఉద్యోగాలలో నూతన అవకాశాలు కలిసివస్తాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి వస్తారు. అప్పుడు ఆర్థికంగా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. సంవత్సర ప్రథమార్థం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీరు అనుకున్న పనులను సాధించగలుగుతారు. ఆధ్యాత్మికంగా దైవదర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్, పౌల్ట్రీ రంగం, శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభత్వ పరంగా కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. ఫైనా న్స్ సీములకు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండటం మంచిది. రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితుల విషయంలో అందరిని నమ్మరాదు.
శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నత పదవులు లభిస్తాయి. కెరియర్ పరంగా చూసుకుంటే లాభ దాయకంగానే ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమైన ఫలితాలిస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురువు ద్వితీయ స్థానంలో ఉండి ఏడవ స్థానాన్ని అంటే మీ వివాహ స్థానాన్ని చూస్తాడు కాబట్టి గురువు ఐదవ స్థానం పైన కూడా దష్టి పెడతాడు కాబట్టి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వ్యాపార పరంగా ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. దానిని జాగ్రత్తగా ఉపయోగించుకుని సేవింగ్స్ రూపంలో ముందుకు వెళ్ళడం మంచిది.
విదేశీయాన ప్రయత్నాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. వత్తి, ఉద్యోగాల పరంగా కొన్ని రంగాలలో నిరాశ కలిగినా సంతానంఅభివద్ది చెందడం, వాళ్ళ వలన పేరు ప్రఖ్యాతులు రావడం సంతోషం కలిగిస్తుంది. అదనపు బరువు బాధ్యతలు తప్పవు. రావలసిన బాకీలు ఎంతో శ్రమతో ఓర్పు వహించి కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు. చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పలేనిస్థితి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. హెచ్1బి, పి.ఆర్, గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది.గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న వారు పోటీ పరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగం సాధిస్తారు. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించాలి.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. జూన్ 2వ తేదీనుండి చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబ వృద్ధి సాధించుకుంటారు. సమాజం లో గౌరవం పొందుతారు. సమయపాలన ద్వా రా విజయాలు అందుకుంటారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో
పాల్గొంటారు. మీకున్న పలుకుబడితో నూతన కార్యక్రమాలు పూర్తి చేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కళారంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా లేదు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. అక్టోబర్ 31 తర్వా త ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునేవారికి అనుకూల మైన కాలం. వైద్యవృత్తిలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైన్ రంగంలోని వారికి, సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, బొటిక్స్ నడిపేవారికి, ట్రావెల్స్ సంస్థలో పనిచేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మీ ప్రతిభతో పై అధికారుల మెప్పు పొందగలుగు తారు. ప్రభుత్వరంగంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పై అధికారుల అండదండలతో ముందకు సాగుతారు. స్త్రీ శక్తి ఏంటో నలుగురికి చూపించాలి, దేనిలోను తక్కువకాదని పట్టుదలతో, కృషితో మీ వృత్తిరీత్యా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. క్రీడారంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. దేశం గర్వించదగిన విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించుకోవడం, అలాగే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం వలన మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు తోడుంటుంది.
సింహరాశి
ఆదాయం: 05 వ్యయం: 05
రాజ: 06 అవ: 06
మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1వ పాదముల యందు పుట్టిన వారు.
సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహమైనటువంటి గురువు జూన్ రెండవ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానం అనగా లాభ స్థానంలో ఉండటం వలన అదష్ట సమయంగా చెప్పవచ్చు.అన్నిరకాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.ఊహించని ధన లాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభ మవుతుంది. ఉద్యోగపరంగా పదోన్నతి ప్రమోషన్స్ లభిస్తాయి.వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు, లీజులు రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి రాహువు ఏడవ ఇంటిలో ఉండటం అనేది అనుకూల -మైనది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది అంటే అన్ని అనుకూలంగా ఉండవని కాదు కానీ ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన గురు గ్రహ ప్రభావం వలన ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించ గలుగుతారు.
ఎప్పుడైతే గురువు లాభ స్థానం నుండి వ్యయ స్థానంలోకి అడుగుపెడతారో అనగా జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయంలో రాహుకేతువులు మరియు గురు, శని గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. ఈ మధ్య సమయం సింహరాశి వారికి కష్టతరమైన సమయంగా చెప్పవచ్చు. ఖర్చులు ఎక్కువవుతాయి. ఈ ఖర్చులలో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవై ఉంటాయి. ఈ అష్టమ శని యొక్క ప్రభావం సంవత్సర ప్రథమార్థంలో అంతగా మీకు కనిపించదు కానీ ద్వితీయార్థంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపార పరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సర ద్వితీయార్థంలో గురువు 12 వ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ఉద్యోగ పరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ సభ్యులకు దూరంగా కాలం గడపవలసిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు వెళ్లడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్నవారికి పి.ఆర్., గ్రీన్‌కార్డు, హెచ్.1బి వీసా లభిస్తుంది.
రాహువు 7వ ఇంటిలో ఉండటం వలన ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. భార్యా భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. రాహువు కళత్ర స్థానంలోఅంటే వివాహ స్థానంలో ఉన్నారు కాబట్టి వివాహ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంవత్సర ద్వితీయార్థం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన.
అక్టోబర్ 31వ తేదీన గురువు జన్మరాశిలోకి వస్తారో అప్పుడు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం, శని గ్రహ స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ట్రాన్స్‌ఫర్ కానీ ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా మీ కృషి, పట్టుదలతో సఫలం అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థాయికి చేరుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.
క్రీడారంగంలో, సాహిత్య, విద్యారంగంలో మీ అంచనాలు ఫలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, లాయర్లకు, పోలీస్ శాఖలో ఉన్నవారికి, యోగా మెడిటేషన్ సెంటర్స్, పౌల్ట్రీరంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్‌మెంట్, ఫాస్ట్‌పుడ్ సెంటర్స్, చిన చిన్న వ్యాపారస్థులకు, హాస్టల్స్ నడిపేవారికి, గోల్డ్‌స్మిత్స్‌కి, కార్పెంటర్స్‌కి, బొటిక్స్, న్యూరాలజీ, డెంటిస్ట్, ఇ.ఎన్.టి, గైనకాలజిస్టులకు, డర్మటాలజిస్టులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయరంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల వల్ల మానసికంగా కృంగిపోవడం,నమ్మినవాళ్ళు మోసం చేశారనే బాధ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దైవానుగ్రహం వల్ల ఒక పదవి మిమ్మల్ని వరించడం జరుగుతుంది.
విద్యార్థినీ విద్యార్థులకు సువర్ణకాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాలం కలిసివస్తుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడితే తప్ప, శ్రద్ధ పెంచితే తప్ప ఆశించిన ఫలితాలు సాధించకపోవచ్చు. హచ్1బి, గ్రీన్‌కార్డు, పి.ఆర్.లకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులను నమ్మి మోసపోవద్దు. ఎవరు మనవారో, ఎవరు కాదో పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా గోప్యత వహించడం అనేది చెప్పదగినది. ఎం.బి.ఎ., వైద్య విద్య, సి.ఎ., ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి మంచి అవకాశాలుఉంటాయని చెప్పవచ్చు. అలాగే విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక స్థానచలనం కలిగే అవకాశం ఉంది.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వస్తాయి. వివాహ సంబంధమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి తేడా ఉంటుంది. పట్టుదలతో మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడతారు. మీ పేరుమీద స్థిరాస్తులు పెరుగుతాయి. గృహనిర్మాణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. అయినవారితో, ఆప్తులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల వేధింపులు ఎక్కువ అవుతాయి. అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారపరంగా అనేక అవకాశాలు కలిసి వస్తాయి. మీకు సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. మధ్యలో మూడు నెలలు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ సహనం, ఓర్పుతో అన్ని సమస్యల నుండి బయటపడగలుగు తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ప్రెగ్నెన్సి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి స్వంత నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందిపడతారు. ఈ రాశివారు ప్రతి రోజు ప్రతి నిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, దుర్గ స్తోత్రం పఠించడం లేదా వినడం, అలాగే 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది.
కన్యారాశి
ఆదాయం: 08 వ్యయం: 11
రాజ: 05 అవ: 05
ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1,2 పాదముల యందు పుట్టినవారు.
కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. అతిపెద్ద గ్రహమైన శని ఈ సంవత్సరం ఏడవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. రాహువు కుంభ రాశిలో, కేతువు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉంటాడు. గురువు జూన్ రెండవ తేదీ వరకు పదవ స్థానంలో అంటే కర్మ స్థానంలో ఉంటాడు. జూన్ 2 నుండి లాభ స్థానంలోకి అనగా 11వ స్థానంలోకి గురువు వెళ్తాడు. అక్టోబర్ 31వ తేదీ నుండి వ్యయ స్థానంలోకి వెళ్తాడు. ముఖ్య గ్రహాల స్థానాన్ని చూసుకున్నట్లయితే వత్తి పరంగా ఆర్థిక పరంగా గురువు కర్మ స్థానంలో ఉండటం వలన సంవత్సర ప్రథమార్థంలో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ రెండవ తేదీ వరకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. గురువు యోగిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వ పరమైన ఉద్యోగం కానీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలకు గానీ ఎంపిక కావడం జరుగుతుంది. వత్తిపరంగా మాత్రం అభివద్ధి చాలా బాగుంటుంది. పనిలో ఒత్తిడి కూడా అదేవిధంగా ఉంటుంది.
జూన్ రెండవ తేదీ నుండి ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలను అందుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధన లాభం వంటివి కలుగుతాయి. రాహువు ఈ రాశి వారికి ఆరవ ఇంటిలో ఉన్నాడు, ఇది చాలామంచి యోగం. మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. శని సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో ఉన్నంత కాలం వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడుతాయి. సంవత్సర ప్రథమార్థం వరకు కూడా మంచి ఫలితాల కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. గురువు పదవ ఇంట్లో అలాగే 11వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి.
విద్యా పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి రాహువు ఆరవ ఇంట్లో ఉండటం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీ రంగాల వారికి బాగుంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తల తీసుకోవాలి. ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యా విషయాలకు సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారో ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు లేదా విదేశాల్లో స్థిరపడడానికి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు విదేశీ విద్యకు సంబంధించిన విషయాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గురువు ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలిస్తున్నాడు. గురువు జూన్ 2 నుండి ఏకాదశ స్థానంలో సంచరించడం వలన కార్య విఘ్నత అనేది ఉండదు.
రాహువు ఆరవ ఇంట్లో ఉండటం అనేది అదష్ట స్థానంగా చెప్పవచ్చు. విద్యార్థినీ విద్యార్థులు మీ కషి పట్టుదలతో మంచి ర్యాంకులు సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కేతువు 12వ స్థానంలో ఉండటం వలన శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది. పుణ్య కార్యాలు చేస్తారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దైవ కార్యక్రమాలు చేస్తారు. డిసెంబర్ 5న కేతువు వ్యయం నుండి లాభస్థానంలోకి మారడం వలన వృత్తిలో మంచి పేరుప్రఖ్యాతులు, సామాజికంగా అందరిలోను, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రతివిషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. యోగ, ధ్యానం మెడిటేషన్ మరియు దైవ కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరికి మనశ్శాంతి లభిస్తుంది.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశి స్త్రీలకు శారీరకశ్రమ ఎక్కువగా ఉంటుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూల ఫలితాలు చూస్తారు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో మంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలబడతారు. విద్యా సాంస్కృతిక సంబంధమైన విషయాలు బాగుంటాయి. గైనిక్ సమస్యలు తలెత్తుతాయి. ప్రతిపనిలో ఆటంకాలు ఎదురైనా మనోబలంతో, ఆత్మ విశ్వాసంతో విజయం సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి. వివాహ సంబంధమైన విషయాలలో మొండి పట్టుదలతో కాకుండా కొన్ని విషయాలలోనైన సర్దుకుపోయే ధోరణిని అవలంభిస్తారు. మీ మనోధైర్యం, నిబ్బరం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యూటీపార్లర్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. చాలా విషయాలలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండటం చికాకు కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంత వరకు రుణాలు తీర్చగలుగుతారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారు, చేతి వృత్తి పనులు చేసేవారికి, హోమియోపతి వైద్యులకు, ఆర్టిఫిషియల్ జ్యూవెలరీ రంగంలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వివాదాలు నిదానంగా సర్దుకుంటాయి. వ్యాపారంలో లాభించే ఆర్డర్లు వస్తాయి. వ్యక్తిగత స్థాయి, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పెరుగుతుంది. మీది అనుకున్నది, ఆశించినది, ఆశపడి, కషి చేసినది నిజంగా మీదే అవుతుంది. ఈ రాశివారు 21 మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
తులరాశి
ఆదాయం: 05 వ్యయం: 14
రాజ: 06 అవ: 03
చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు, విశాఖ 1,2,3 పాదముల యందు పుట్టినవారు.
తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశివారికి పంచమం లో రాహువు, ఆరింట శని, తొమ్మిదింట గురు వు, ఏకాదశంలో కేతువు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. గురువు జూన్ రెండవ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత పదవ స్థానంలోకి అంటే కర్మ స్థానంలోకి వెళ్తాడు. అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్లీ 11వ స్థానంలోకి వెళ్తాడు. ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే ఆరవ ఇంట్లో ఉన్నాడో ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు వచ్చినా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన అవి ఏవి కూడా మీపై పని చేయవు. శని ఆరవ ఇంట్లో ఉండటం అనేది అదష్టంగా చెప్పవచ్చు. దీనిని శుభ శని అని కూడా పిలుస్తారు. పాత రుణాలను తీర్చడానికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. తులా రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్య పరంగా ఆర్థికంగా అనుకూలతలు సూచిస్తు న్నాయి. వత్తి పరంగా ఒత్తిడి అనేది ఉంటుంది.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వత్తి పరంగా గురువు జూన్ మాసం వరకు 9వ ఇంట్లో ఉంటాడు. శని ఆరవ ఇంట్లో ఉంటాడు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్థిరమైన అభివద్ధిని చూస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ రెండవ తేదీన గురువు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు అధికంగా ఉంటాయి. కేతువు 11వ ఇంటిలో ఉండటం వలన వ్యాపార పరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. జూన్ రెం డవ తేదీ తర్వాత గురువు పదవ ఇంటిలోకి మారడం వలన వత్తిపరంగా విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పని ఆలస్యంగా జరగడం వలన మానసికంగా ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చెప్పదగినది.
విద్యార్థినీ విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది. ముఖ్యంగా వైద్యవృత్తిలో ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాల నుకు నే వారికి కాలం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. చదవు మీద శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. దుర్వ్యసనాలకు, సోషల్ మీడియాకు, స్నేహితులకు దూరంగా ఉండటం చెప్పదగినది. మీరు తీసుకునే స్వంత నిర్ణయాల వలన నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. అహంకార పూరితమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. పది మందిలో హూందా గా ఉండటం కోసం, విలాసవంతమైన జీవితం గడపటం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తా రు. ఏది ఏమైనా విద్యార్థినీవిద్యార్థులు తమ చదువుపట్ల అంకిత భావంతో ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది.ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో ధరించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
మీ ప్రణాళికలను విజయవంతంగా అమ లు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో, దైవ కా ర్యాల్లో పాల్గొంటారు. మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలకు, సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు, కాం ట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి, హోల్ మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉ ద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టి పోటీ ఉంటుంది, అయినా అందులో విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితం కొనసాగిస్తారు. వృత్తివ్యాపారాలు అనుకూలంగా ఉంటా యి. అయితే తాత్కాలిక వ్యాపారాలకు దూరం గా ఉండటం మంచిది. కొంతమంది వ్యక్తులు మీతో భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారు. ఎవరిని నమ్మకుండా మీరు స్వంతంగానే వ్యాపారం చేయండి, మంచి లాభాలు ఉంటాయి. పది మంది సలహాలు తీసుకుని, తుది నిర్ణయం మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం వలన లాభపడతారు. సినీకళా రంగాల వారికి, సాహిత్య రంగాలలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు, బ్యూటీపార్లర్స్ నడిపేవారికి, ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కలుసుబాటుతనంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దైవదర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. రుణాలకు దూరంగా ఉండటం మంచిది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వా రు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో, మంగళవారం హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి, ఎనిమిది మంగళవారా లు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చే యండి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చే యించడం, హనుమాన్ చాలీసా చదవడం వల న మంచి ఫలితాలు పొందగలుగుతారు.
వృశ్చికరాశి
ఆదాయం: 11 వ్యయం: 05
రాజ: 02 అవ: 06
విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు.
వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతువు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థికపరంగా అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్థం వరకు దూరంగా ఉండటం మంచిది. ఛాయాగ్రహమైన రాహువు మాత స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. జూన్ రెండవ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతియైన గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణాలు చాలా వరకు తీర్చగలుగు తారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు, హోటల్‌మేనేజ్‌మెంట్, హోల్‌సేల్ రిటేల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికలావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమకుతగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది.
నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి. డిసెంబర్ 5వ తేదీన రాహువు చతుర్థం నుండి తృతీయ స్థానంలోకి కేతువు దశమంనుండి భాగ్యస్థానంలోకి మారడం వలన చిన్నచిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చికరాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింటిలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయ పరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్నిజాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. థైరాయిడ్, బి.పి., షుగర్, ఇండైజిషన్, ఉదర సంబంధిత సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి.
విద్యా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.ద్వితీయార్థంలో వీసాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తె అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలం- గా ఉంది. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పదిమందిలో మెచ్చుకోలుగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, సాఫ్ట్‌వేర్, మెకానికల్, కళాసాంస్కృతిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీపార్లర్స్, కాస్మోటిక్స్, ఇ.ఎన్.టి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాలలో ఉన్న వారు మంచి అబివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం, అలాగే రాహుకేతువులకు జప, దాన, తర్పణాలు చేయించడం అనేది చెప్పదగిన సూచన.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసివస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్యా సాంస్కృతిక విషయాలలో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వత్తి, ఉద్యోగాలపరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాలలో మీ శ్రమకి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, ఐ.వి.ఎఫ్ కోసం వెళ్ళేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తి స్తారు. ఆర్భాటాలకు, పొగడ్తలకు దూరంగా ఉండటం చెప్పదగినది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థాధిపతియైన రాహువు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వలన సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు.ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
ధనుస్సురాశి
ఆదాయం: 14 వ్యయం: 11
రాజ: 05 అవ: 06
మూల 1,2,3,4 పాదములు, పూర్వాషాఢ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదముల యందు పుట్టినవారు.
ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, సప్తమంలో గురువు, తొమ్మిదింట కేతువు, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో, డిసెంబర్ 5వ తేదీ నుండి రాహువు ద్వితీయంలో, కేతువు అష్టమంలోకి మారుతారు. ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది.
ఈ రాశి వారికి అర్దాష్టమ శని నడుస్తోంది. అర్దాష్టమ శని ప్రభావం వలన మానసికమైన ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ రాశివారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుం ది. డిసెంబర్ 5 నుండి కేతువు అష్టమంలో ఉండటం వలన ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి ఆరోగ్యం విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాహువు ద్వితీయ స్థానంలోకి మారడం వలన ఆర్థికంగా కలిసివస్తుంది. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ లభిస్తాయి. సేవింగ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండటం, పొగిడే వాళ్లను దూరంగా ఉంచడం చెప్పదగినది. ఉద్యోగంలో మీపై దుష్ర్పచారం చేసే వారుంటారు జాగ్రత్త వహించండి. ఎవరు ఎన్ని చెప్పినా న్యాయబద్ధంగా నడుచుకోవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని భావిస్తారు. గ్రీన్‌కార్డు వీసాకోసం ప్రయత్నం చేసే వారికి వీసా లభిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. వివాహాది శభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానం యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ న్యాయవాదులకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, రియల్‌ఎస్టేట్ రంగంలోని వారికి, ప్రథమార్థం బాగున్న ప్పటికీ, ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు అఘోరపాశుపత హోమం, లక్ష్మీగణపతి హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. మెడలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన గ్రహదిష్టి, నరదిష్టి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఏది ఏమైన మీకున్న ధైర్య సాహసాల వల్లనే బాగా రాణిస్తారు.
విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటిలో సీటు లభిస్తుంది. హెచ్1బి వీసా లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. సెల్ఫ్‌డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైన ఉంటే తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. మీరు ఎంత కష్టపడితే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. క్రమశిక్షణతో అడుగులు వేస్తారు. డిసెంబర్ 5 తర్వాత రాహువు ద్వితీయ స్థానంలో ఉండడం వలన ధనప్రాప్తి, ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సేవింగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం, అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం మంచిది.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి అధికారప్రాప్తి. కుటుంబంలోని బరువుబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించి, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్థం చాలావరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఏర్పడుతా యి. వ్యాపార పరంగా అధిక ధనవ్యయ సూచ న. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అయితే మీరు ఒత్తిడిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్, చార్టెడ్ అకౌంటెంట్స్, బొటిక్స్, సినీ కళారంగంలోని వారికి, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ , అడ్మిని స్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ధనం తక్కువగా సంపాదించినా పేరుప్రఖ్యాతలు బాగుంటాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఐ.టి. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా మీకున్న తెలివి తేటలతో అధిగమిస్తారు. వివాహానికి సం బంధించిన విషయ వ్యవహరాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ద్వి తీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతా నం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భూ క్రయవిక్రయాలు లాభిస్తాయి. వాహనయోగం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరుమీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల మోసపోయే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన.
మకరరాశి
ఆదాయం: 07 వ్యయం: 08
రాజ: 01 అవ: 06
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2 పాదముల యందు పుట్టినవారు.
మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, ఆరింట గురువు, అష్టమంలో కేతువు ఉన్నారు. అలాగే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో, అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు అష్టమంలో, డిసెంబర్ 5నుండి రాహువు జన్మరాశిలో, సప్తమంలో కేతువు ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబందం కుదురుతుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఒక పదవి లభిస్తుంది.
ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాల యొక్క స్థానాలను పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని మూడవ ఇంటిలో అంటే మీన రాశిలో ఉండి చాలా అనుకూలంగా ఉన్నారు. రాహువు ధన స్థానంలో అంటే కుంభ రాశిలో ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో అంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. శని మూడవ ఇంటిలో ఉన్నాడు కాబట్టి వత్తి ఉద్యోగ వ్యాపారలపరంగా అద్భుతమైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మీ కృషి ప ట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారు లు మీ ప్రతిభను గుర్తిస్తారు. నలుగురిలో మీకం టూ ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి.
వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. రాహువు ధన స్థానంలో ఉంటారు కాబట్టి ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతువు అష్టమ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. స్కిన్ ఎలర్జి, ఎసిడిటి, ఉబ్బసం, థైరాయిడ్ వల్ల కొన్నిఇబ్బందులు పడే అవకాశం ఉంది.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రయాణాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శని మూడో ఇంట్లో ఉండటం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వీరికి వివాహపరంగా చూసుకున్నట్లయితే గురువు ఏడవ ఇంటిలో ఉన్నంతకాలం వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నించొచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పని చేయాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. సాంకేతిక విద్యాపరంగా రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించ- డానికి అవకాశాలు కలిసివస్తాయి. హెచ్1బి, గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. విదేశాలలో చదువుకుని, పార్ట్‌టైం ఉద్యోగం చేసే వారికి కలిసివస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది.
సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి, మెకానికల్ రంగంలోని వారికి, వైద్యవృత్తిలోని వారికి, హోటల్ వ్యాపారస్తులు, మీడియా రంగంలోని వారికి మంచి అవకాశాలు కలిసివస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్దలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా జాత్త్ర వహించాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అప్పు ఇవ్వడం కలిసిరాదు. విదేశాలలో స్థిరపడాలని అనుకునేవారికి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిరావాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. ప్రయత్నించండి. విదేశీయానం మీరు ఊహించిన దానికంటే ముందుగానే వెళ్ళే అవకాశం ఉంది.
ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో భృగుపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం, కుబేర కుంకుమతో మంగళవారం, శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చెప్పదగినది. ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించగలుగుతారు.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. హెచ్1బి, గ్రీన్‌కార్డు లభించే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి విదేశీయానం చేసే అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని సంందర్భాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. గైనిక్‌కు సంబంధించిన, చర్మసంబంధమైన, థైరాయిడ్‌కు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటా యి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటకు, చేతలకు విలువ పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి, బొటిక్స్ నడిపే వారికి, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీపార్లర్స్ నడిపేవారికి, కాస్మోటిక్స్ వారికి ఈ సంవత్సరం కలిసివస్తుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇన్సూరెన్స్‌ల విషయంలో జాగ్రత్త వహించండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. స్వగృహం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. సెల్ఫ్‌డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గాస్తోత్రం పఠించడం, ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి.
కుంభరాశి
ఆదాయం: 02 వ్యయం: 08
రాజ: 04 అవ: 02
ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3 పాదముల యందు పుట్టినవారు.
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు ఉన్నారు. గురువు మొదటి ఆరు నెలలు పంచమ స్థానంలో ఉంటాడు తరువాత జూన్ నెల రెండవ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు ఆరవ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో గురువు ఉంటారు. అలాగే డిసెంబర్ 5 నుండి వ్యయంలో రాహువు, షష్ఠమంలో కేతువు సంచారం ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది.
జన్మరాశిలో రాహుగ్రహ సంచారం వల్ల వృత్తిఉద్యోగాలపరంగా స్థాన చలనం, ఉద్యోగంలో ట్రాన్స్‌ఫర్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతాయి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలిననాటి శని యోగిస్తుంది, కొంతమంది ఏలిననాటి శని యోగించదు. అది వారి జన్మజాతకంపై ఆధారపడి ఉంటుంది.
సంవత్సర ప్రథమార్థంలో గురు గ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు ఆశించిన అభివద్ధిని సాధించగలుగుతారు. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. గతంలో పెట్టబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సర ద్వితీయార్థం అనగా జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు ఆరవ స్థానంలో అనగా రోగ స్థానంలో ఉంటారు దీని వలన వత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు ఏడవ ఇంటిలోకి మారుతారు అంటే సప్తమ స్థానంలో గురు కేతువులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉండటం వలన గణేశ యోగం అనేది ఏర్పడుతుంది.
ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్ఠమ గురువు వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక, వత్తి, ఉద్యోగాలపరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు, వృథా ఖర్చులు ఉండే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత మానసికంగా, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ప్రయాణాలలో చికాకు, ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీరు సాధించాలనుకునే స్థాయికి స్థాన చలనం ఏర్పడుతుంది. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. వత్తి ఉద్యోగాల పరంగా మీ కంటే పెద్ద స్థాయి కలిగిన వారిలో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. ఇ.యన్.టి. సమస్యలు, లివర్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, స్పైన్‌కి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ప్రాథమికంగా చిన్న కోర్టులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అయినప్పటికీ అంతు లేని అలోచనలతో మీ మనసు ఆందోళనకి గురి అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికపరంగా, కుటుంబపరంగా పురోగతి బాగుంటుంది.
విద్యార్థినీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళేవారికి అక్టోబర్ తర్వాతకాలం అనుకూలంగా ఉంది. హెచ్1బి, గ్రీన్‌కార్డు, ప్రయత్నాలు కలిసివస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాలలో ఉండి ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసివస్తాయి. శని వీరికి ద్వితీయంలో బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం అనేది ఉంటుంది. డిసెంబర్ 6 నుండి వ్యయంలో రాహు, ఆరింట కేతుగ్రహ సంచారం వల్ల ఆరోగ్య పరమైన ఇబ్బందుల నుండి బయటపడ గలుగుతారు. విద్యా సంబంధమైన లోన్లు మంజూరు అవుతాయి. దూరప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో మీ ఆశయం నెరవేరుతుంది. స్వార్థపరులుగా ఉండకుండా పదిమందికి సహాయం చేయాలనే ఆలోచనతో ఉండండి. పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండటం చెప్పదగినది. విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. దూరప్రాంత విద్యావిషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అంశాలు ఓ దారికి వస్తాయి. పొదుపు పథకాలకు ప్రాధాన్యత ఇస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభిస్తాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది.సంఘంలో మీ మాటలకు, చేతలకు విలువ పెరుగుతుంది. ఆ తర్వాత వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, ఆచితూచి వ్యవహరించడం అన్నివిధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. టీ.వి. సినీ కళారంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి అత్యున్నతమైన పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణులవు తారు. సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, వృత్తి వ్యాపార, ఉద్యోగం మరియు అన్ని రంగాలలో ముందంజలో ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మినహా ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం, దుర్గాస్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రథమార్థంలో అఘోరపాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్యపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
మీనరాశి
ఆదాయం: 14 వ్యయం: 11
రాజ: 07 అవ: 02
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు.
మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్ఠమంలో కేతువు, వ్యయంలో రాహువు ఉన్నారు. గురువు జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు ఆరవ స్థానంలో ఉంటారు. అంటే రోగస్థానంలో కేతువుతో పాటు కలిసి ఉంటారు.
ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. మీన రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపారపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపేణ ధనం సమకూరుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత మీనరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపార పురోగతి బాగుంటుంది. రాస్యాధిపతి దశమాధిపతియైన గురువు పంచమస్థానంలో ఉచ్ఛస్థితి పొంది ఉండడం వలన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది.
ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహ అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రజాధరణ పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది, మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పరంగా ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కళా, సాహిత్యరంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహువు లాభస్థానంలోకి, కేతువు పంచమంలోకి మారడం వలన విశేషమైన పేరుప్రఖ్యాతులు, ఆర్థికపురోగతి బాగుంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. వివాదస్పదమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం అనేది చెప్పదగినది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను మీకు అప్పగిస్తారు. సినీ కళారంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, డాక్యుమెంట్ రైటర్స్‌కి, చిరువ్యాపారస్తులకు, లెదర్ వ్యాపారస్తులకు, జూడ్‌బ్యాగ్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నవారికి, కాస్మటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మారంగంలోని వారికి, గోల్డ్‌స్మిత్స్‌కి, బొటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకు, పూజాసామాగ్రి వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు ఫాస్ట్‌పుడ్ సెంటర్స్‌కి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత విద్య కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది. స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్‌కార్డు, హెచ్1బి వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా, యు.కె. జర్మనీ, ఈ దేశాలు వెళ్ళే వారికి, ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటి, స్కిన్‌కి సంబంధించిన విషయ వ్యవహారాలు మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, స్పైన్‌కి సంబంధించిన విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ధన వ్యయం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రూపాయి వస్తుంది కదా అని రెండు రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంది, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే, భవిష్యత్తులో ఇబ్బందిపడే అవకాశం లేకపోలేదు. చదువుపై శ్రద్ధ వహించకపోతే చదువు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఏదో ఉద్యోగం చేసే ఆలోచన వస్తుంది. చదువుకునే వయసులో చదువుని అశ్రద్ధ చేయడం సరికాదు. సంగీత, సాహిత్యాది, లలితకళల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతే సఫలం అవుతాయి. అధికార స్థానాలలో వున్నవారు అత్యంత సన్నిహితం అవుతారు. స్వప్రయోజనాలు, అభివద్ధి కొరకు పరపతి ఉపయోగపడుతుంది. ఆర్థిక వనరులను ఇబ్బందిలేని రంగాల్లో పెట్టుబడులు పెడతారు. శుభ కార్యాలకు బంధువర్గం సహకారం కన్నా దైవమే ఎక్కువ మేలు చేస్తాడు. ముందు జాగ్రత్త చర్యలు అనుకున్న ఫలితాలని ఇస్తాయి. కళ, విద్యారంగాల్లో రాణిస్తారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవలసిన పరిస్థితి రావచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విదేశీయానం చేస్తారు. సం తానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగం సాధిస్తారు. కొన్ని కొన్ని
విషయాలలో జీవితభాగ స్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుం ది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న చోట సీటు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. బ్యూటీపార్లర్ వ్యాపారస్తులకు, కాస్మోటిక్స్, బ్యూటిషియన్, బొటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కి ఆర్టిపిషియల్ జ్యువెలరి రంగంలో ఉన్నవా
రికి ఈ సంవత్సరం మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి.
సంవత్సర ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి అనుకూలంగా ఉంటుంది. హెచ్1బి, గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ పరమైన అవార్డులు అందుకోగలుగుతారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి వాటికి కష్టంమీద ఎంపికవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, మనమీద ఈర్ష్యాద్వేషాలు ఉంటాయని అలాగే ధరించకుండా ఉంటారు. అభరణాలను లాకర్లలో భద్రపరచండి, ఇంట్లో భద్రపరచడం అంత క్షేమం కాదు. రాజకీయ రం గంలో ఉన్న వారికి పదవలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం రాహువుకి అధిష్టాన దేవత దుర్గా దేవి కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళ, శుక్రవారం రోజున అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించడం, ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
:: పంచాంగ కర్త ::
శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి
వైధిక్‌ఆస్ట్రో.కామ్ (www.vydicastro.com)
ఫోన్ నెం: 90141 26121, 84669 32224/2225