Reading Time: < 1 minute

తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక మేరీమాత స్కూల్ మైదానంలో పిడుగుపడింది. అదే సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతి చెందారు. బిఎస్ఆర్ కంపెనీలో ఆయన సర్వేయర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట గ్రామంలో వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు.