Reading Time: < 1 minute

జగిత్యాల అర్బన్ మండలం మోతెలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందారు. గ్రామానికి చెందిన దొడ్ల సంపత్‌ (25) అనే యువకుడు అప్పుల బాధతో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతితో ఏడుస్తూ అతడి తల్లి మల్లవ్వ (60) గుండెపోటు వచ్చి కుప్పకూలింది. అదే ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. కానీ, ఆమె కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.