
న్యూఢిల్లీ: విశాఖపట్నం వాసులకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్‌న్యూస్ అందించారు. త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌పై ఆయన పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌కు రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎపిలో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.