Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. అక్క ప్రవర్తన మంచిగా లేదనే కారణంతో ఆమెను చంపి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి.. చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.