Reading Time: < 1 minute

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సీజన్‌ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అభిషేక్ శర్మకు అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతున్నట్లు తెలిపింది. అతడి గైర్హాజరీలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్‌లో ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకు ముందు జరిగిన దేశవాళీ టోర్నమెంట్‌లో ఝార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన కిషన్.. జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో అతడికి ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.