Reading Time: < 1 minute

ధృవ్ సర్జా హీరోగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమాలో నోరా ఫతేహీ చిందులేసిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ పాటలోని సాహిత్యం, నృత్యంపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఈ పాట గురించి ప్రస్థావన వచ్చింది. లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపి ఆనంద్ భదౌరియా ఈ పాట అంశాన్ని ప్రస్థావించారు. దీనిపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దుల్లోనే ఉండాలని.. అందుకే పాటను బ్యాన్ చేసినట్లు తెలిపారు.

ఈ ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదాస్పదం కావడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. వెంటనే మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంది. ఈ వివాదంపై ఇప్పటికే బాలీవుడ్ గేయ రచయిత రకీబ్ ఆలం స్పందించారు. దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన పాటను చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు అనువదించానని అన్నారు. వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో కొత్త వెర్షన్ రాయమని కోరినట్లు తెలిపారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.