Reading Time: < 1 minute

ఐసిసి తాజాగా టి-20 ర్యాంకింగ్స్‌ని ప్రకటించింది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్-5లోకి వచ్చేశాడు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (753), భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (740) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. బుమ్రా ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 702 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ర్యాంకుల టాప్‌-5లో ఎలాంటి మార్పు లేదు. భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ (875), ఇషాన్ కిషన్ (871) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తిలక్ వర్మ ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 742 పాయింట్లతో ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక టి-20 ప్రపంచకప్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‘ సంజూ శాంసన్ (636) ఒక స్థానం ఎగబాకి 21వ ర్యాంకులో స్థిరపడ్డాడు. ఆల్ రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు సికందర్ రాజా, భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.