Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యనమి ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. 2029లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సిఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని తెలిపారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.