Reading Time: < 1 minute

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గురువారం ఈ సినిమా సీక్వెల్ విడుదల కానుంది. ుధురంధర్ తొలి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదల. ఇప్పడు రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అయితే గురువారం సినిమా విడుదల కాగా.. అంతకు ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే చాలా మంది సినిమాను ముందుగానే చూసేందుకు ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, తీర సమయానికి తెలుగులో ప్రీమియర్ షోలను రద్దు చేసి.. టికెట్ డబ్బులు రీఫండ్ చేశాయి. సాంకేతిక సమస్యలతో సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ ప్రీమియర్‌ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక గురువారం నుంచి యథాతధంగా హిందీతో పాటు తెలుగులోనూ ప్రదర్శించనున్నట్లు సమాచారం.