Reading Time: < 1 minute

ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్ సాధనకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ముంబై టీమ్ యాజమాన్యం అభిమానులతో పంచుకొంది. ఈ సీజన్‌లో అందరి దృష్టి రోహిత్‌పైనే నిలిచింది. ఇప్పటికే టెస్టులు, టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇలాంటి స్థితిలో రానున్న వన్డే ప్రపంచకప్ కోసం ఐపిఎల్‌ను సాధనగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు. పొట్టి క్రికెట్‌లో విధ్వంసక బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ చాలా కాలంగా ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడి కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అతను ఇప్పటికీ ముంబైకి ప్రధాన ఆటగాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలవాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు.