
ముంబై: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాపై సౌతాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఎబి డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే బుమ్రా మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో అతన్ని మించిన బౌలర్ ఎవరూ లేరన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఒక్క బుమ్రాకి మాత్రమే ఉందన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మెరుగైన ప్రదర్శన చేయడం బుమ్రా ప్రత్యేకత అన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లో భారత్‌ను విజేతగా నిలుపడంలో అతని పాత్ర చాలా కీలకమని పేర్కొన్నాడు. రానున్న ఐపిఎల్‌లో బుమ్రా చెలరేగి పోవడం ఖాయమని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.