Reading Time: < 1 minute

మహిళలంటే మాజీ మంత్రి కెటిఆర్‌కు చిన్నచూపని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిండు సభలో మహిళా సంక్షేమంపై ప్రతిపక్ష నేత కెటిఆర్ ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళా రుణాలపై సభలో చర్చ జరిగిన సందర్భంగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కుటుంబ సభ్యులైనా, బయట మహిళలైనా ఎదగనీయాలంటూ కెటిఆర్‌కు మంత్రి సీతక్క చురకలంటించారు.

గులాబీ పార్టీలో డ్రగ్స్ తీసుకునే నాయకులు ఉన్నారని, దానిపై ఆయన ముందు స్పందించాలని సీతక్క సవాల్ విసిరారు. యువతకు ఆ పార్టీ నేతలు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ముందుగా గులాబీ పార్టీ నేతలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సభలో ప్రశ్నించారు. ఫ్రీ బస్సుపై కెటిఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. కెటిఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలని మంత్రి సీతక్క సూచించారు.