
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈ మేరకు ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం ప్రధాన అజెండా కాగా, దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.