Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్’ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్టు2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన మొదటి పార్టు ఏకంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా హిందీలోనే విడుదలైంది. రెండో పార్టు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ మార్చి 19న రిలీజ్ కానుంది. ‘ధురంధర్: ది రివెంజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మార్చి 18న సాయంత్రం నుంచి పెయిడ్ ప్రివ్యూలు వేయనున్నారు.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసేందుకు సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో మూవీ టికెట్ల ధరలు కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 నుండి రూ. 2400 వరకు టికెట్ల ధరలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మూవీ రన్ టైమ్ పై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ సినిమా రన్ టైమ్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈమూవీ రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఇక, ఓవర్సీస్‌లో 3 గంటల 49 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా,  ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, రాకేష్ బేడి, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.