Reading Time: < 1 minute

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంగళవారం 291 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కంచుకోట అయిన భబానీపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 52 మంది మహిళా అభ్యర్థులను టిఎంసి బరిలోకి దింపుతోంది. అలాగే, SC/ST వర్గాలకు చెందిన 95 మంది అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.

ఇక, అనిత్ థాపా నేతృత్వంలోని ‘భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా’ (BGPM) కోసం TMC మూడు స్థానాలు.. కాలింపాంగ్, డార్జిలింగ్, కుర్సియోంగ్ లను కేటాయించింది.

కాగా, సిఎం మమతాపై, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి పోటీ చేయనున్నారు. సోమవారం 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బిజెపి ప్రకటించింది.సువేందు అధికారి నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన నందిగ్రామ్‌లోనే మమతా బెనర్జీని ఓడించారు. ఈసారి నందిగ్రామ్‌లో ఆయనపై TMC తరపున పవిత్ర కర్ పోటీ చేయనున్నారు.