
చెన్నై: నటుడు విజయ్ TVK పార్టీకి చెందిన నాయకుడు ఆధవ్ అర్జున్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా లెటర్ విడుదల చేశారు. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ చివరికి అదే సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి, టివికె నేత వ్యాఖ్యలను ఖండించిన రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, టివికె నాయకుడు అర్జున్ మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడు DMK పార్టీ ఆయన్ను బెదిరించిందని.. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అర్జున్ వ్యాఖ్యలపై రజనీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలనిరజనీకాంత్ అభిమాన సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.