Reading Time: < 1 minute

కెటిఆర్ వైఖరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తప్పుబట్టారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి కెటిఆర్‌పై మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం కెటిఆర్ అహంకారానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో పార్టీ మారడాన్ని ప్రోత్సహించిన చరిత్ర మీది కాదా అని కెటిఆర్‌ను మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నిజాయితీగా ఉంటే ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతుందని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సీనియర్ నాయకులు కట్టుకథలు అల్లుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు.