Reading Time: < 1 minute

తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది.  బడ్జెట్ సమావేశాలు సందర్భంగా మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చలు జరిగాయి. ఈ  క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. అనంతరం రేపటికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులనుద్ధేశించి చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఈనెల 20న రాష్ట్ర ఆర్ఖిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.