Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో కోమటి రెడ్డి చిట్ చాట్ చేశారు. జగ్గారెడ్డి మరో పిజెఆర్.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని కొనియాడారు. జగ్గారెడ్డి పిసిసి చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయని తెలియజేశారు. హామ్ రోడ్ల టెండర్లు ఇంకా ఖరారు కాలేదని, కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎలా అంటారు? అని ప్రశ్నించారు. హరీష్ రావు రికార్డుగా మాట్లాడితే అన్నింటికీ జవాబు చెప్తానని, కమీషన్ల కోసమే కాళేశ్వరంలో నాసిరకమైన మోటార్లు ఉపయోగిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.