Reading Time: < 1 minute

అమరావతి: రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేవు అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు కొరత రాకుండా చూడాలని అన్నారు. గ్యాస్ సరఫరా అంశంపై సిఎం సమీక్షించారు. రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పిజి గ్యాస్ నిల్వలున్నాయని, మరికొన్ని టన్నుల గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు తెలియజేశారు. తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై స్టడీ చేయాలని, మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని అన్నారు. ఈ కెవైసి, ఒటిపిల ద్వారా సిలిండర్ల డైవర్సన్ లేకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ లభ్యత పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా కంపెనీలు చూడాలని, సిటి గ్యాస్ డిస్ట్రబ్యూషన్ నెట్ వర్క్ మరింత విస్తరించేలా చూడాలని అన్నారు. కెజి బేసిన్ గ్యాస్ ను నెట్ వర్క్ ద్వారా సరఫరా అయ్యేలా చూడాలని, సిఎన్జి, పిఎన్జిల వినియోగం గరిష్టంగా పెంచేలా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.