
బెంగళూరు: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీ భద్రత తదితర అంశాలపై ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగళూరులో ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి. మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య సీజన్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఆరంభ వేడుకలు కూడా ఇక్కడే జరుగనున్నాయి. కాగా, 2025లో ఆర్‌సిబి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.