
పశ్చిమాసియాలో అమెరికాఇజ్రాయెల్ సంయుక్త బలగాలు, ఇరాన్ నడుమ సోమవారంనాడు పరస్పర దాడులు కొనసాగాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.దక్షిణ లెబనాన్‌లోని ఓ గ్రామంపై జరిపిన దాడిలో ముగ్గురుమృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు పారామెడిక్ సిబ్బంది ఉన్నారు. తాజా దాడుల ద్వారా లెబనాన్‌లో క్షేత్రస్థాయి దాడులకు ఇజ్రాయెల్ తెరతీసింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు చెదిన 70శాతం మిలిటరీ లాంఛర్లను దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అబుదాబి లక్షంగా ఇరాన్ జరిపిన దాడిలో పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. మరోవైపు ఇరాన్ జరిపిన దాడులలో సోమవారం దుబాయ్ దద్దరిల్లింది. ఇరాన్ డ్రోన్ ధాటికి ఓ ఇంధన ట్యాంకర్ దెబ్బతింది. దీనితో అక్కడికి సమీపంలోని దుబాయ్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్ క్షిపణి దాడులతో దుబాయ్ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ నుంచి ఎటువంటి క్షిపణి లేదా డ్రోన్ల దాడులు
తలెత్తకుండా దెబ్బకు దెబ్బతీస్తామని యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంలో 35 వరకూ ఇరాన్ డ్రోన్లను దెబ్బతీశామని సౌదీ అరేబియా తెలిపింది. సౌదీకి చెందిన అత్యంత కీలకమైన ఫుజైరా చమురు క్షేత్ర ప్రాంతంపై ఇరాన్ సోమవారం దాడికి దిగింది. ఈ డ్రోన్ల దాడిలో ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అబూధాబిలో ఇరాన్ దాడిలో ఓ పాలస్తీనియన్ మృతి చెందారు. ఇక బహ్రెయిన్ కూడా తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయితే దానిని తమ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుందని తెలిపింది. మరోవైపు తమపై దాడులకు ఎర్రసముంద్రం నుంచి తన వంతు పాత్ర పోషిస్తున్న అమెరికా నౌక జెరాల్డ్ ఫోర్డ్‌కు సాయం అందిస్తున్న వ్యవస్థలను లక్షంగా ఎంచుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు తమ అధికారిక వార్త సంస్థ ప్రెస్ టివిలో ప్రకటన చేసింది.