Reading Time: < 1 minute

 దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,685 తగ్గి రూ.1.56 లక్షలకు చేరింది. మార్చి 13న ఇదే బంగారం ధర రూ.1.58 లక్షలుగా ఉంది. ఒక కిలో వెండి ధర కూడా రూ.11,777 తగ్గి రూ.2.48 లక్షలకు చేరింది. శుక్రవారం ఇది రూ.2.60 లక్షలుగా ఉండింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో రెండు రోజుల్లో బంగారం రూ.4,589, వెండి రూ.19,590 తగ్గాయి. మార్చి 12న బంగారం రూ.1.60 లక్షలు, వెండి రూ.2.68 లక్షలుగా ఉన్నాయి.