
రాష్ట్ర రవాణా శాఖ, ఎలెట్స్ టెక్నోమీడియా సంస్థ భాగస్వామ్యంతో, హైదరాబాద్ మెట్రో రైల్ సహ భాగస్వామ్యంతో ఈ నెల 17 మంగళవారం నోవోటెల్, హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ -2026’ నిర్వహించనుంది. ‘యాక్సిలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సమ్మిట్‌లో విధాన నిర్ణేతలు, రవాణా అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, స్టార్టప్‌లను, సాంకేతిక సంస్థలు పాల్గొని దేశంలో స్థిరమైన సమగ్ర మొబిలిటీ భవిష్యత్తుపై చర్చించనున్నారు. సమ్మిట్ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ డా. కె. ఇళంబరితి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొననున్నారు.