
దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఆర్టీసీ చైర్ పర్సన్ పదవి త్వరలో రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి, సీనియర్ ఎమ్మెల్యే ఎన్. పద్మావతికి దక్కబోతున్నదని తెలిసింది. గతంలో ఆమెకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ చైర్ పర్సన్‌గా నియమిస్తే ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. తాజాగా పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి ఇస్తామన్నా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆర్టీసీ చైర్ పర్సన్‌గా పద్మావతిని నియమించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.