Reading Time: < 1 minute

 కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని, మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా..? మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నా..అది మునిగిపోయే పడవనే అని పేర్కొన్నారు. గ్రౌండ్‌లో ఎవరు బలంగా ఉన్నారో అందరికి తెలుసు అని చెప్పారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఎంఎల్‌ఎ మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మల్లారెడ్డి ఖండించారు. తన వయసు ప్రస్తుతం 73 ఏళ్లు అని, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఇటీవల తన పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకే రేవంత్ సిఎం రెడ్డిని కలిశానని తెలిపారు.