Reading Time: < 1 minute

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించడంతో దానికి తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టారు.

ఆలయ పనులకు శంకుస్థాపన..

భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే తొలి విడతలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు సిఎం రేవంత్ రెడ్డి ఈనెల 27వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు,సెంటర్ లైటింగ్, పూల మొక్కలు సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు ముమ్మరంగా చేపట్టాలన్నారు.