
టి 20 ప్రపంచ కప్ -2026 గెలుచుకుని టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి సిఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎస్‌ఎటిజి చైర్మన్ శివసేనారెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండి సోనీ బాలాదేవిలు పాల్గొన్నారు.