Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్లకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల మాదిరిగానే ఆర్టీసి బస్సుల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ఢిల్లీలో నివసిస్తున్న అర్హత కలిగిన ట్రాన్స్‌జెండర్ లు కూడా మహిళల లాగానే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సందర్బంగా సిఎం రేఖ గుప్తా మాట్లాడుతూ.. “ప్రతి పౌరుడు గౌరవంగా, సమానత్వంతో ప్రజా సేవలను పొందాలి. సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు.

ఈ పథకం ద్వారా ట్రాన్స్‌జెండర్లు ఆర్థిక పరిమితులు లేకుండా నగరం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం త్వరలో అమలు కానుందని, మహిళలకు ప్రస్తుతం ఉన్న ఉచిత బస్సు ప్రయాణ వ్యవస్థ మాదిరిగానే విధానాలను అనుసరిస్తుందని, లబ్ధిదారులకు సజావుగా అమలు జరుగుతుందని అధికారులు తెలిపారు.