Reading Time: < 1 minute
Eluru Mp Putta Mahesh Kumar Responds To Hyderabad Drugs Controversy Says He Is Innocent

MP Putta Mahesh Kumar: హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో, తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, తనను ఎంపీగా గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఘటనలో తన పేరు రావడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఎంపీ, ఆ రోజు డిన్నర్ కు హాజరు అయిన మాట వాస్తవమే అయినా, తాను ఎటువంటి తప్పు చేయలేదని, విచారణలో నిర్దోషిగా బయటకు వస్తాననే నమ్మకం వెలిబుచ్చారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

Read Also: Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

‎ఈ అంశంపై పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న ఎంపీ, అదే సందర్భంలో పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని, పార్టీ నుండి అందిన నోటీసుపై లిఖితపూర్వకంగా అధిష్టానానికి వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ సంఘటన నుంచి, తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఎప్పటిలా కట్టుబడి పనిచేస్తానని ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నానని తన ప్రకటనలో పేర్కొన్నారు ‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్..