July 8, 2026

Colors Swathi Marriage: డైరెక్టర్‌తో కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫొటోస్ వైరల్!

Colors Swathi Marriage:  డైరెక్టర్‌తో కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫొటోస్ వైరల్!
Reading Time: 2 minutes

Colors Swathi Marriage: డైరెక్టర్‌తో కలర్స్ స్వాతి రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫొటోస్ వైరల్!

Caption of Image.

తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  హీరోయిన్ గా తన నటనతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అలరించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ పెళ్లి పీటలెక్కింది.  అది కూడా తనను డైరెక్ట్ చేసిన టాలీవుడ్ దర్శకుడితోనే. 2023 ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని స్వాతి వివాహం చేసుకుంది. బుధవారం ( జూలై 8, 2026 ) ‘Hitched’ అనే సింగిల్ వర్డ్ క్యాప్షన్ తో పెళ్లి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చూసి అభిమానులకు సర్పైజ్ ఇచ్చింది.

సింపుల్ గా పెళ్లి.. 

ఈ వివాహ వేడుక ఎటువంటి ఆడంబరాలు లేకుండా, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది. తెల్లటి సాంప్రదాయ వస్త్రధారణలో వరుడు శ్రీకాంత్ మెరవగా.. కేరళ శైలిలో ఆకుపచ్చ రంగు అంచున్న తెల్లటి చీరలో స్వాతి మెరిసిపోయింది. హోమం ముందు కూర్చుని ఇద్దరూ ఒకటవుతున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాంత్ నాగోటితో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు స్వయంగా ఫోటోలు పంచుకుంటూ స్వాతి ప్రకటించడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది. 

సినిమా సెట్స్‌లోనే ప్రేమాయణం?

2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి, ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అతనితో విడిపోయింది. అయితే, విడాకుల వార్తలపై ఆమె ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కొంత గ్యాప్ తర్వాత ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. బహుశా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు శ్రీకాంత్‌తో ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారి.. అది కాస్తా పెళ్లి పీటల వరకు దారితీసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా పలువురు హీరోయిన్లు తమ సినిమాలకు దర్శకత్వం వహించిన వారినే జీవిత భాగస్వాములుగా ఎంచుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో కలర్స్ స్వాతి పేరు చేరింది.

శుభాకాంక్షల వెల్లువ

ఈ ‘షాకింగ్ అండ్ స్వీట్ న్యూస్ వినగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటులు నవీన్ చంద్ర, ఇంద్రజిత్, రాజా రవీంద్ర, దర్శకురాలు నందిని రెడ్డి వంటి వారు కామెంట్స్ సెక్షన్‌లో ఈ జంటకు ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’చెప్పారు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘అష్టాచమ్మా’, ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ వంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న స్వాతి.. తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రయాణంలో ఈ జంట మరింత సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swati (@swati194)

 

©️ VIL Media Pvt Ltd.