గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినగలిగే జొన్న పిండి పకోడీ
జొన్నల పకోడికి కావాల్సిన పదార్ధాలు : కప్పున్నర మొక్కజొన్న గింజలు, ఒక కప్పు శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,10 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోడా ఉప్పు, పకోడీలను వేయించడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.
జొన్న పకోడి ఎలా తయారు చేయాలంటే? ముందుగా జొన్న గింజలను తీసుకుని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పెట్టుకోవాలి. దీనిని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో గ్రైండ్ చేసిన జొన్న, ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి, ఇంకా కొద్దిగా బియ్యపు పిండిని కూడా దీనిలో వేసుకోవాలి.
ఈ జొన్న పిండి మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , మూడు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 కరివేపాకు ఆకులు , కొద్దిగా కొత్తిమీర దీనిలో మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. ఇంకా దీనిలో అర గ్లాస్ నీళ్లు వేసి పకోడీ పిందిలాగా చేతితోనే కలపాలి.
ఈ పకోడీలను బాగా వేయించాలి : ఇంకా దీనిలో సోడా ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. వీటిని కలిపితే భలే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్ లో ఆయిల్ చేసి అది బాగా వేడయ్యాక, దీనిని తీసుకుని వీటిని ముద్దలుగా తీసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
సాయంత్రం తింటే వీటినే తినాలి : వేడి వేడి పకోడీలను ఒక ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇంకా సాయంత్రం తింటే ఇవి ఇంకా రుచిగా ఉంటాయి. వేడి వేడి టీ లో ఇవి నంజుకుని తింటే ఆపకుండా తింటూనే తింటారు. ఈ సారి మీ ఇంట్లో కూడా తప్పక ట్రై చేయండి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తింటూనే ఉంటారు.




