July 10, 2026

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులో రెండు కీలక మార్పులు

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులో రెండు కీలక మార్పులు
Reading Time: < 1 minute

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులో రెండు కీలక మార్పులు

Caption of Image.

బ్రిటన్: ఇంగ్లాండ్‎తో జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక నాలుగో టీ20లో భారత్ టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. అతిథ్య జట్టును బౌలింగ్‎కు ఆహ్వానించాడు. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచులో టీమిండియా జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. బౌలర్లు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా స్థానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది.

రెహాన్ అహ్మద్ స్థానంలో లియామ్ డ్వాసన్ ప్లేయింగ్ లెవన్‎లో చోటు దక్కించుకున్నాడు. బ్రిస్టల్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై వంటిది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ రేసులో ఉంటుంది. మరోవైపు.. అతిథ్య ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గెలుపు జోష్ లో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతుండగా.. వరుస ఓటుములతో అయ్యర్ సేన తీవ్ర ఒత్తిడిలో ఉంది. 

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): 

ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

భారత్ (ప్లేయింగ్ XI): 

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ

 

©️ VIL Media Pvt Ltd.