July 10, 2026

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. చాదర్‌ఘాట్‌లో తగలబడ్డ మెకానిక్ షాపులు

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. చాదర్‌ఘాట్‌లో తగలబడ్డ మెకానిక్ షాపులు
Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. చాదర్‌ఘాట్‌లో తగలబడ్డ మెకానిక్ షాపులు

Caption of Image.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్‌లోని మూసీ లేన్‌లో ఉన్న పలు మోటార్ మెకానిక్ వర్క్‌షాపులు, ఇతర సముదాయాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న తెలంగాణ అగ్నిమాపక శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఏకంగా 7 ఫైర్ టెండర్లను పంపించి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. మళ్లీ ఎక్కడైనా మంటలు చెలరేగకుండా ఉండేందుకు ప్రస్తుతం కూలింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీ తగరం వెంకన్న స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తూ అగ్నిమాపక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం సంభవించింది? అనే వివరాలు అగ్నిమాపక చర్యలు పూర్తిగా ముగిసి, అధికారులు అంచనా వేసిన తర్వాత తెలియాల్సి ఉంది. 

 

 

©️ VIL Media Pvt Ltd.