Tilak Varma: వైస్ కెప్టెన్‌పై పీక్స్‌లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?

Tilak Varma: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ తెలుగు తేజం తిలక్ వర్మపైనే నిలిచాయి. నేటి మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేక బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనే అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన ఈ హైదరాబాద్ స్టార్, ప్రస్తుతం యూకే పర్యటనలో ఫామ్ కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. ఈ టూర్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మినహా, మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌లలో కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడం అతనిపై ఒత్తిడిని పెంచేస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో కేవలం 3 పరుగులకే స్టంపింగ్ అవుట్ అవ్వడం తిలక్ స్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది. అయితే తిలక్ వర్మ ఫామ్ కోల్పోవడానికి అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చడమే ప్రధాన కారణమనే వాదనలు సైతం గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి నంబర్ 3 స్థానంలో అద్భుతంగా రాణించే తిలక్‌ను, ఇషాన్ కిషన్‌ను టాప్ ఆర్డర్‌లో చేర్చడం కోసం కింది స్థానాలకు నెట్టడం ఆటను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర పరాజయం చవిచూడటంతో, తిలక్ వర్మ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ, కేవలం మార్పుల కోసమే జట్టు కాంబినేషన్‌ను మార్చకూడదని మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ హెచ్చరిస్తున్నారు. సంజును జట్టులోకి తెస్తే టాప్-3లోనే ఆడించాలని, మిడిల్ ఆర్డర్‌లో పంపిస్తే ఆశించిన ఫలితాలు రావని ఆయన స్పష్టం చేశారు. గణాంకాల ప్రకారం కూడా సంజుకు లోయర్ ఆర్డర్‌లో దారుణమైన రికార్డు ఉంది. ఒకవేళ సంజును టాప్ ఆర్డర్‌లో ఆడించలేని పక్షంలో, తిలక్ వర్మకే మరో అవకాశం ఇచ్చి ప్రస్తుత బ్యాటింగ్ లైనప్‌తోనే ముందుకు వెళ్లడం మంచిదని నాయర్ సూచిస్తున్నారు. అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం జట్టు వైఫల్యానికి ఆటగాళ్ల ఫామ్ కంటే ఇక్కడి పిచ్ పరిస్థితులను, వాతావరణాన్ని అంచనా వేయడంలో విఫలం కావడమే కారణమని ఒప్పుకున్నారు. వరుస ఓటములతో కంగారు పడి నిర్ణయాలు తీసుకోకుండా, పరిస్థితులకు అలవాటు పడటంపైనే మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ తన సహజ సిద్ధమైన స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఫామ్ అందుకుంటాడా, లేక సంజు శామ్సన్ కోసం త్యాగం చేయక తప్పదా అనేది నేటి మ్యాచ్‌తో తేలిపోనుంది.