July 10, 2026

బుకింగ్ లేకుండా ఆటో ఎక్కుతున్నారా..? హాస్పిటల్కు తీసుకెళ్తానని మహిళను ఈ డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్

బుకింగ్ లేకుండా ఆటో ఎక్కుతున్నారా..? హాస్పిటల్కు తీసుకెళ్తానని మహిళను ఈ డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్
Reading Time: < 1 minute

బుకింగ్ లేకుండా ఆటో ఎక్కుతున్నారా..? హాస్పిటల్కు తీసుకెళ్తానని మహిళను ఈ డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్

Caption of Image.

ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్స్ వచ్చాక ప్రయాణీకుల భద్రత కాస్త మెరుగుపడింది. ట్రాకింగ్, లైవ్ షేరింగ్ మొదలైన ఆప్షన్స్ ఉండటంతో ఎంతో కొంత ధైర్యంగా మహిళలు ఆటోల్లో, కార్లలో ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ అప్పుడోఇప్పుడో ప్రమాదాలు తప్పడం లేదు. ఇదిలా ఉంటే బుక్ చేసుకోకుండా నేరుగా ఆటో ఎక్కిన మహిళను ఓ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన ఐటీ కారిడార్ లో కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలో ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మించి ఆటో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి అత్యాచారం చేసి పారిపోయాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

జూలై 8న ఉప్పల్ భరత్‌నగర్‌లో ఆటో ఎక్కిన మహిళను నిందితుడు ఆంగోతు జేత్య ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మహిళకు మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సెల్‌ఫోన్, నగదు దోచుకుని పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సాయంతో 24 గంటల్లోనే నిందితుడిని అన్నోజిగూడలో అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.