Watch: తిరుమలలో 9 అడుగుల భారీ పాము.. కాలుకు చుట్టుకుని ఏం చేసిందో తెలుసా..? ఇదిగో వీడియో

సాధారణంగా పాము పేరు చెబితే చాలు ఏదో తెలియని భయం వెంటాడుతుంది.. ఇక కనిపిస్తే.. పరుగులు తీయడమే.. పాముల భయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. విష పాములు కాటేస్తే గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు. సాకాలంలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడొచ్చు.. అయితే.. శేషాచలం అటవీ ప్రాంతంలో తరచూ పాములు కనిపిస్తుంటాయి.. ముఖ్యంగా తిరుమల కొండపై పాముల సందడి ఎల్లప్పుడూ కనిపిస్తుంది.. అయితే.. పాములు మెట్ల మార్గం అలాగే.. తిరుమలలో తరచూ భక్తుల కంటపడటంతో అలజడి మొదలవుతుంది.. వెంటనే టీటీడీ సిబ్బంది స్పందించి పాములను రెస్క్యూ చేసి.. అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు..
వర్షాకాలం ప్రారంభమవడంతో.. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాముల సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇందులో భాగంగానే నారాయణగిరి పార్కులో 9 అడుగుల జర్రిపోతు కనిపించింది. నారాయణగిరి పార్కులో పనిచేస్తున్న గార్డెన్స్ సిబ్బంది, భక్తులు కంటపడ్డ జర్రిపోతూ అందరినీ భయపెట్టింది. జెర్రిపోతును చూసి అంతా పరుగులు పెట్టారు.. అక్కడే ఉన్న టిటిడి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు.
వీడియో చూడండి..
అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు 9 అడుగుల జిర్రిపోతును పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే.. జెర్రిపోతు.. భాస్కర్ నాయుడు కాలుకు చుట్టుకుని.. కాసేపు హల్ చల్ చేసింది.. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ జర్రిపోతును చాకచక్యంగా బంధించారు. సేఫ్ గా జర్రి పోతును చేత్తో పట్టుకుని బ్యాగ్ లో బంధించిన భాస్కర్ నాయుడు.. ఆ తర్వాత దాన్ని బైక్ పై తీసుకెళ్లారు. అనంతరం శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో నారాయణగిరి పార్క్ లో పనిచేస్తున్న గార్డెన్ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..